సమంతకి అలాంటి ఆలోచనలు ఉన్నాయా..? లైవ్ లోనే బయటపెట్టేసిందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్ళిన సమంత.. మళ్ళీ తిరిగి ఇండియా చేరుకునింది . కాగా రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన సమంత.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది .

ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ మీ స్కిన్ ఇంత కాంతివంతంగా మెరిసిపోవడానికి కారణం ఏంటా ..? అంటూ క్వశ్చన్ చేయగా.. సమంత నిజానికి మయోసైటిస్ వ్యాధికి స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు నా స్కీన్ మొత్తం మారిపోయిందని ..చిన్మయి నా స్కిన్ ని గ్లాస్ టోన్ గా మారుస్తానని చెప్పిందని చెప్పుకొచ్చింది . అంతేకాదు సిటాడిల్ గురించి చెప్తూ.. ఈ సిరీస్ లో మీరు నన్ను ఫుల్ యాక్షన్ మోడ్ లో చూస్తారని చాలా హాట్ గా కనిపిస్తానని క్లారిటీ ఇచ్చింది.

అంతేకాదు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏదైనా చెప్తారా ..? అని అడగ్గా ప్రెసెంట్ అయితే ఏ ప్రాజెక్టుకి కమిట్ అవ్వలేదు .. కానీ నా లిమిట్స్ బోర్డర్స్ క్రాస్ చేసి సినిమా చేయాలని ఉంది చూద్దాం..అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికే సమంత తన సినిమాల విషయంలో బోర్డర్స్ క్రాస్ చేస్తుంది అని జనాలు కామెంట్స్ చేస్తుంటే ..ఇంకా బోర్డర్స్ క్రాస్ చేసి మూవీ తీయాలని ఉందా ..?ఏంటి.. ఈ సమంత ఇలా మాట్లాడుతుంది అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . చూద్దాం రానున్న రోజుల్లో సమంత ఏం చేస్తుందో..?