చిన్న వయసులోనే మేయర్‌గా రికార్డులకు ఎక్కిన అమ్మ.. భర్త MLA..!

మాతృత్వం అనేది కేవలం మహిళలకు మాత్రమే దొరికిన వరం. అది వారి ఆశయ సాధనలో ఎప్పటికీ అడ్డం కాదు అనే అంశంతో ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఎవరిదో కాదు అతి చిన్న వయసులోనే తిరువనంతపురం మేయర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి రికార్డ్ సృష్టించిన ఆర్య రాజేంద్రన్ ది.

గతేడాది ఆమె కేరళకు చెందిన సిపిఐ పార్టీ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ని వివాహం చేసుకుంది. ఇటీవలే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆర్య రాజేంద్రన్ ఈ నేపథ్యంలో అత్యవసర పనుల నిర్వహణ కోసం తన రోజుల బిడ్డతో కార్యాలయానికి వచ్చింది. ఒడిలో పసికందును ఉంచుకొని ఫైళ్లను చూస్తూ సంతకం చేస్తున్న ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్‌లను ఆకట్టుకుంటుంది.

ఇక ఈ నేపథ్యంలో ఆమె పై ప్ర‌సంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్‌లు. అలాగే కొత్తగా తల్లి అయిన వారికి పని ప్రదేశాల్లో చైల్డ్ కేర్ ఫెసిలిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ చర్చలు కొనసాగుతున్నాయి.