ఎట్టకేలకు ఒక మంచి నిర్ణయం తీసుకున్న కీర్తి సురేష్.. ఫ్యాన్స్ ఖుషీ..!!

సౌత్ ఇండియాలో స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించకుండా ఎలాంటి పాత్రలో నైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. గత ఏడాది ఈమె నటించిన సర్కారు వారి పాట చిత్రంలో గ్లామర్ తో అదరగొట్టేసిన కీర్తి సురేష్.. ఈ సినిమా కంటే ముందే ఈమె నటించిన సానికాయుధం అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో కూడా ప్రతి పాత్రల అద్భుతంగా నటించింది కీర్తి సురేష్. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నప్పటికీ ఇలాంటి పాత్రలలో నటించడం చాలా అరుదని చెప్పవచ్చు.

Keerthy Suresh got Rs. 2 Crore for acting in Rajinikanth's 'Annaatthe' | Tamil Movie News - Times of India

ఆ తర్వాత పెంగ్విన్ సినిమాలో కూడా గర్భవతిగా కనిపించింది.. మర్కార్ చిత్రంలో కూడా విదేశీయుడిని ప్రేమించే అమ్మాయిగా అద్భుతంగా నటించింది.ఇలా కీర్తి సురేష్ ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించింది. అంతేకాకుండా సీనియర్ హీరోల సరసన చెల్లెలి పాత్రలో కూడా నటించింది ఈ క్రమంలో అలా వచ్చినవే అన్నత్తై, భోళా శంకర్ రజనీకాంత్ చిరంజీవి వంటి హీరోలకు సినిమాలలో నటించిన కీర్తి సురేష్ ఈ సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి. ఈ రెండు చిత్రాలు అటు స్టార్ హీరోల కెరియర్ లోనే ఒక చిత్త రికార్డుని మూట కట్టుకున్నాయి.

Chiranjeevi, Keerthy Suresh to star in 'Bholaa Shankar' - The Hindu

అయితే ఈ చిత్రాలను నటించడం కీర్తి సురేష్ కి చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో కీర్తి సురేష్ ఇక మీదట ఇలాంటి సినిమాలను చేయనని చెల్లెలి పాత్రలలో అసలు నటించానని తెలియజేసినట్లు తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలను తప్ప చెల్లెలి పాత్రలను ఇక మీద చేయనని నిర్ణయాన్ని తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.