జాన్వీ కపూర్ చిరకాల కోరిక ఇదే.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తీరనది..!!

సినిమా ఇండస్ట్రీలోకి నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే అమ్మ పేరు చెప్పుకొని కూడా కొంతమంది బ్యూటీస్ ఇంట్రడ్యూస్ అయినా.. పెద్దగా సక్సెస్ కాలేదు. చాలా తక్కువ మంది మాత్రమే అమ్మ పేరుని ఇండస్ట్రీలో నిలబెట్టుకోగలిగారు. ఆ లిస్ట్ లోకి వస్తుంది జాన్వికపూర్ . టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్థానంలో ఉంది .

తెలుగులోనూ అదే స్థానం దక్కించుకోవడానికి దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో రెండు సినిమాలకు సైన్ చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇలాంటి క్రమంలోనే జాన్వి కపూర్ కి ఉన్న చిరకాల కోరిక గురించి బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే జాన్వి కపూర్ ఆ కోరిక తీర్చుకోలేదు అంటూ కూడా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

ఆ కోరిక మరి ఏంటో కాదు జాన్వి కపూర్ తన తల్లి కి సంబంధించిన బయోపిక్ లో నటించాలని ఉందట .బ్రతికున్నప్పుడు తన తల్లితో కలిసి సినిమా చేద్దామని అనుకునిందట . కానీ ఆ దేవుడు ఆ కోరిక తీర్చకుండానే ఆమెను పై లోకాలకు తీసుకెళ్లిపోయాడు. కనీసం ఆమె బయోపిక్ లో అయినా నటించి ఆ ముచ్చట తీర్చుకోవాలని చూస్తుందట . కానీ శ్రీదేవి బయోపిక్ ను తెరకెక్కించే సాహసం ఎవరు చేయడం లేదు . ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న ఏం లాభం అమ్మబయోపిక్ లో నటించాలి అంటే అదృష్టం ఉండాలిగా అంటున్నారు జనాలు..!!