” స్కంద “మరింత జోష్‌పెంచాల్సిందే..!!

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ” స్కంద “. మరి బోయపాటి నుంచి సెన్సేషనల్ హిట్ ” అఖండ ” అనంతరం వస్తున్న సినిమా ఇది కావడంతో అంచనాలు భారీ స్థాయిలో నెలకున్నాయి.

ఇక ఇదిలా ఉండగా మేకర్స్ ఈ సినిమాని స్టార్టింగ్ నుంచే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి కూడా వచ్చేసింది. అయినా కూడా ఎక్కడ కూడా అగ్రెసివ్ ప్రమోషన్స్ అయితే కనిపించడం లేదు. తెలుగులోనే అంతంత మాత్రం ప్రమోషన్స్ కనిపిస్తుండగా… ఇక మిగతా భాషల్లో అసలు ప్రమోషన్స్ మొదలే కాలేదు.

దీంతో సినిమా విడుదలకి కేవలం కొన్ని రోజుల సమయమే మిగిలి ఉండడంతో ఈ డోస్ అయితే సరిపోదని రామ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుందా? లేక చాలా సినిమాల్లానే లాస్ట్ మినిట్ లో లిమిటెడ్ రిలీజ్ అవుతుందా అనేది చూడాల్సి ఉంది.