“సమంతతో విజయ్ ఘాటు రొమాన్స్”.. రౌడీ హీరో లవర్ ను లైన్ లో పెట్టిన నాగ చైతన్య.. రివేంజ్ మామూలుగా లేదుగా..!?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో హీరోయిన్ సమంత హీరో విజయ్ దేవరకొండ రొమాంటిక్ పిక్స్ వైరల్ గా మారాయి. వీళ్లిద్దరు కాంబోలో తాజాగా తెరకెక్కిన సినిమా ఖుషి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ఉదయం థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . కాగా మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లే సినిమాల్లో మంచి కంటెంట్ ఉండడం దానికి తగ్గ డైలాగ్స్ పడడం సినిమాకి ప్లస్ అయ్యాయి . దీంతో సినిమాను బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేలా చేశారు అభిమానులు.

ఈ సినిమాకి మరింత హైలెట్గా నిలిచింది విజయ్ – సమంత రొమాన్స్. వైఫ్ అండ్ హస్బెండ్ చేసే హెల్తీ రొమాన్స్ ఎలా ఉంటుందో స్క్రీన్ పై కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ జంట . ఎవరైనా సరే ఈ జంటను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే . అంత పర్ఫెక్ట్ గా వీళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది . అయితే ఇది ఈ రొమాన్స్ అందరికీ నచ్చిన అక్కినేని ఫ్యాన్స్ కి నాగచైతన్య లాంటి వాళ్లకి అసలు నచ్చదు . అది ఎందుకో కూడా మనకు తెలిసిందే . అయితే ఇదే క్రమంలో నాగచైతన్య సైతం తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టబోతున్నాడు అంటూ తెలుస్తుంది.

సమంత – విజయ్ రొమాన్స్ చూసి కడుపు మండిపోయిన నాగచైతన్య తన సినిమాలో విజయ్ గర్ల్ ఫ్రెండ్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నాకు ఛాన్స్ ఇచ్చారట . అంతేకాదు ఇదే రేంజ్ లో రొమాన్స్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారట . తద్వారా సమంతతో రొమాన్స్ చేసినప్పుడు నాగచైతన్యకు ఎంత కడుపు మండిపోయి ఉంటుందో .. అదే విధంగా తన లవర్ తో రొమాన్స్ చేసినప్పుడు విజయ్ దేవరకొండకు సైతం అదే ఫీలింగ్ కలుగజేసేలా రివెంజ్ తీర్చుకోవాలి అని నాగచైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట .

చందు మొండిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి – కీర్తి సురేష్ తో స్క్రీన్ చేసుకుంటున్న నాగచైతన్య ఆ తర్వాత తెరకెక్క బోయే సినిమాలో రష్మిక మందన్నా ను చూస్ చేసుకున్నారట . ఇది కూడా ఫుల్ టు ఫుల్ లవ్ రొమాంటిక్ సినిమా గా తెరకెక్కబోతుంది అంటూ తెలుస్తుంది, ఏం మాయ చేసావే రేంజ్ లో ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు అంటూ ఓ న్యూస్ కూడా వఒరల్ అవుతుంది..!!