రజినీకాంత్ సిల్క్ స్మితని అంత టార్చర్ చేశారా.. అసలు విషయం ఏమిటంటే..?

ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ అయినట్టుగా మరెవరు కూడా అంతగా ఫేమస్ కాలేదని చెప్పవచ్చు. తన నటనతోనే స్టైల్ తోనే అందరిని ఆకట్టుకున్న రజినీకాంత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయన సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడతాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే జైలర్ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే ఇలాంటి రజనీకాంత్ అప్పట్లో ఒక హీరోయిన్ ను సిగరెట్లతో కాలుస్తూ టార్చర్ పెట్టారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయట.

The women in Rajinikanth's life before Latha Rangachari, and rumours of an  affair with Silk Smitha - India Today

రజనీకాంత్ ఎవరిని సిగరెట్ల తో కాల్చారు అనే విషయానికి వస్తే అప్పట్లో స్టార్ హీరోయిన్లకే చెమటలు పట్టించిన సిల్క్ స్మిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె చిన్న వయసులోనే తను సంపాదించిన డబ్బులన్నీ పోగొట్టుకొని సూసైడ్ చేసుకొని మరణించింది.. గతంలో చాలామంది చేతుల్లో సిల్క్ స్మిత మోసపోయిందని వార్తలు వినిపించాయి. సిల్క్ స్మితకు రజనీకాంత్ కూడా బానిసయ్యారని వీరిద్దరి మధ్య కొన్ని రోజులు రిలేషన్ ఉందంటూ కూడా వార్తలు వినిపించాయి. రజనీకాంత్ నటించిన కొన్ని సినిమాలలో సిల్క్ స్మిత స్పెషల్ సాంగ్ లలో నటించేది.

అలా రజినీకాంత్ తో ఈమె కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపించాయి. చాలామంది రజనీకాంత్ గురించి నీచంగా మాట్లాడేవారు. సిల్క్ స్మిత శరీరం పైన రజనీకాంత్ సిగరెట్ల తో కాల్చే వారంటూ ఒక వార్తను వైరల్ గా చేశారు.. ఈ వార్త అప్పట్లో రజినీకాంత్ అభిమానులను చాలా ఫైర్ అయ్యేలా చేసింది. రజనీకాంత్ చేసిన మోసం వల్లే సిల్క్ స్మిత మరణించింది అనే వార్తలు కూడా ఇప్పటికీ కోలీవుడ్ మీడియాలో అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటికీ ఈ విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.