కోహ్లీ బయోపిక్ లో రామ్ పోతినేని…. అసలు నిజం ఇదే…!!

రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా బోయపాటి డైరెక్షన్లో ఇటీవల రూపొందిన మూవీ స్కంద. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ” స్కంద ” ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశాడు హీరో రామ్ పోతినేని. పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ ప్రస్తావన వ‌చ్చింది. రామ్‌కి కోహ్లీ పోలికలు ఉంటాయని… బయోపిక్ లో హీరోగా ఎందుకు నటించకూడదని అడిగాడు ఇంట‌ర్‌వ్యూవ‌ర్‌. దీనిపై స్పందించిన రామ్…” విరాట్ బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ గా ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు”. ఈ పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తానని తెలిపాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పర్ఫెక్ట్ మ్యాచ్ అని అభిమానులు కామెంట్జ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే రామ్ చరణ్ ఈ బ‌యోపిక్‌లో హీరోగా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.