” ఆర్ఆర్ఆర్ ” రికార్డ్ బ్రేక్ చేసిన‌ విజయ్ ” లియో ” .. ఇదే ఆ క్రేజి రికార్డ్ ..!!

కోలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ పాన్ ఇండియా మూవీ ” లియో “. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. వరస ప్రమోషన్స్ తో అంచనాలు అమాంతం పెంచేస్తుంది మూవీ టీం.

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా ఐమాక్స్ వర్షన్‌ గురించి అప్డేట్ ఇచ్చారు. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ” లియో ” మూవీ ” ఆర్ఆర్ఆర్ ” రికార్డ్ బ్రేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ” ఆర్ఆర్ఆర్ ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో చరణ్, తారక్ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. లియో ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేస్తుందని చెబుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే అక్కడ ఐమాక్స్ స్క్రీన్స్ లో దాదాపు 80 స్క్రీన్స్లో ” ఆర్ఆర్ఆర్ ” రిలీజ్ కాగా ఇప్పుడు… ఈ రికార్డును బ్రేక్ చేసి… విజయ్ ” లియో ” 80 కి పైగా ఐమాక్స్ స్క్రీన్స్ లో విడుదల అవుతున్నట్లు టాక్.