తన పెళ్లిపై డైరెక్టర్ అట్లీ సంచలన వ్యాఖ్యలు..!!

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన దర్శకత్వం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే జవాన్ సినిమాతో అట్లీ మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని సైతం అందుకున్నారు. అట్లీ తన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచాయి. తన ప్రతి సినిమా కథ కథనం కూడా చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు అట్లీ.

Atlee and Priya's love story will make you believe in true love ahead of  Bigil

అందుకే సౌత్ ఇండియాలోనే అట్లీ పై వచ్చిన స్థాయిలో మరే దర్శకుని పైన కూడా ట్రోల్స్ వినిపించవని చెప్పవచ్చు.. అయినప్పటికీ కూడా అలాంటివేవీ పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో డైరెక్టర్ అట్లీ ముందుకు వేయడం వల్లే తన ఈ సక్సెస్ లో ఉన్నారని తెలియజేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ పలు విషయాలు తెలియజేశారు. రోబో సినిమా సమయంలో డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట అట్లి.. రజనీకాంత్ కి స్టైల్ గా డైలాగ్స్ చెబుతూ ఎలా చేయాలో చూపించే వారట. అంతేకాకుండా రోబో లో అట్లీ డూప్ గా కూడా పనిచేశారని సమాచారం.

అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్ కాగా తన మొదటి సినిమా షార్ట్ ఫిలింలోని తన పేరును అట్లిగా మార్చుకున్నారు.. ఆ షార్ట్ ఫిలిం కు మంచి పేరు రావడం వల్ల డైరెక్టర్ శంకర్ దగ్గర పనిచేసే అవకాశం దొరికిందట ఆ వెంటనే రాజారాణి అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు.. చెన్నైలో స్థిరపడ్డ అట్లీ తెలుగు కుటుంబానికి చెందిన కృష్ణప్రియ అనే అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది.. అలా వివాహమైన తర్వాత పెళ్లి ఫోటోలు బయటికి రావడంతో అట్లీ ఎక్కడో సుడి ఉంది అంటూ పలు రకాలుగా కామెంట్స్ ఎద్దేవా చేస్తూ ఉండేవారట. అలాంటి సమయంలోనే అట్లకి విజయాలు రావడంతో కెరియర్ పరంగా సక్సెస్ బాట పట్టాడు.