ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే బన్నీ – త్రివిక్రమ్ కాంబోలో మూవీ రూపొందుతోందా..?

ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే ఒక నార్మల్ మూవీ ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన నటనతో ఎవరు మ్యాచ్ చేయాలని స్వాగ్‌తో సూపర్ హిట్ చేయగలడు అనేంత గొప్ప పేరు వచ్చింది. దీంతో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా ఒక సాధారణ టాలీవుడ్ డైరెక్టర్ అయిన‌ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పాన్ ఇండియా రేజ్ కి వెళ్ళిన ఏ హీరో అయినా దాదాపు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.

కానీ అల్లు అర్జున్ ఆ రిస్క్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముందుగా ఈ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయాలని అనుకున్నాడట త్రివిక్రమ్. అయితే త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ తీయవలసిన త్రివిక్రమ్ సినిమా ఫైనల్ డ్రాప్ స్క్రిప్ట్ ఎందుకు ఎన్టీఆర్ కు నచ్చలేదట. ఈ కారణంతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు రిజెక్ట్ చేసి దేవర సినిమాకు ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు అదే కథతో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సోషియా ఫాంటసీ బ్యాడ్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందిస్తున్న ఈ మూవీ మహాభారతంలో ఇప్పటివరకు ఎవరు చూడని కొత్త పరమాన్ని సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నాడట త్రివిక్రమ్. ఇక మన పురాణాల మీద త్రివిక్రమ్ కి ఉన్నంత గ్రిప్ భారతదేశంలోనే ఏ డైరెక్టర్ కు లేదనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పురాణం గురించి మాట్లాడితే అలా వింటూ ఉండిపోతారు జనం. అలాంటి పట్టు ఉన్న డైరెక్టర్ తో సరైన సబ్జెక్టు తగిలినప్పుడు ఎన్టీఆర్ ఎందుకు నోచెప్పాడు అని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.

ఇక గతంలో మహేష్ బాబు పుష్పాలాంటి పాన్ ఇండియా మూవీ పుష్పా ని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా స్టోరీని అల్లు అర్జున్ తీసుకొని ఏ రేంజ్ లో క్రేజ్‌ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పావ అవసరం లేదు. ఇక రాబోయే రోజుల్లో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో కూడా అలాంటి సెన్సేషనల్ మూవీ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం పుష్ప 2 చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతాడట.