సందీప్ నువ్వు పెద్ద పిస్తా అనుకుంటున్నావా..? నీ బ్యాటరీ డౌన్.. నాగార్జున ఫైర్‌…!!

” బిగ్ బాస్ ” తెలుగు సీజన్ సెవెన్ ఆసక్తికరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్.. హౌస్ మేట్స్ అయ్యేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇచ్చిన చేస్తున్నారు. ఈ క్రమంలోనే థర్డ్ కంటెస్టెంట్ నాగార్జున ఎవరి పేరును ప్రకటిస్తారని విషయంపై ఎదురు చూశారు జనాలు. ఈ క్రమంలో నిన్న‌టి ఎపిసోడ్‌లో నాగ్ ప్రతి ఒక్కరి మిస్టేక్స్ పై సీరియస్ అయ్యాడు.

ముఖ్యంగా సంచాల్క్ గా వ్యవహరించిన డాన్స్ మాస్టర్ సందీప్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.” సందీప్ నీకు అసలు గేమ్ అర్థం అయిందా. సంచాలక్ అంటే అంపైర్. ఆట మధ్యలో ఇంటర్ఫియిర్ అవ్వకూడదు. మరి నువ్వు ఎందుకు పాయింట్స్ ఇస్తున్నావ్? గేమ్ ను పర్సనల్గా తీసుకుంటున్నావు ఎందుకు? నువ్వేమన్నా పిస్తా అనుకుంటున్నావా?” అని ఫైర్ అయ్యాడు నాగార్జున.

ఇక అమర్ దీప్ ను కూడా గట్టిగా వేసుకున్నాడు. ” నువ్వు నీకోసం ఆడుతున్నావా లేక ప్రియాంక కోసం ఆడుతున్నావా?”అని సూటిగా ప్రశ్నించాడు నాగార్జున..” ఇక కార్తీకదీపం మోనితను కూడా వదిలేయలేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మూడో హౌస్ మేట్ గా శోభా శెట్టి నిలిచింది.