దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటోందా..?

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అలనాటి హీరోయిన్ శ్రీదేవి.. ఇక శ్రీదేవి నటవారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. తన మొదటి సినిమాతోనే స్టార్ హీరో తో నటించడంతో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.

Janhvi Kapoor's Role In NTR Jr, Saif Ali Khan's Devara Revealed
బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా పేరు సంపాదించింది జాన్వీ కపూర్. శ్రీదేవి- బోణి కపూర్ కుమార్తె గా మంచి పాపులారిటీ సంపాదించింది. గ్లామర్ పరంగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జాన్వీ.. బాలీవుడ్ లో మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోతోంది. దీంతో తెలుగులో ఫోకస్ పెట్టిన ఈమె దేవర సినిమాలో నటిస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ సినిమా గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ కొరటాల శివ.

జాన్వీ కపూర్ దేవర సినిమా కోసం తన మొదటి సినిమాకి ఏకంగా రూ.5కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది . ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పలు రకాల పోస్టర్స్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో ఈమె పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర బృందం పలు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అండర్ వాటర్ సీక్వెన్స్ హైలెట్గా పలు రకాల సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు.