ప్రభాస్ ” సలార్ ” మూవీకి బిగ్ షాక్.. ఏం జ‌రిగిందంటే..!!

అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ” సలార్ “. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానులకు అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.. కానీ మేకర్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాన్స్‌ను డిస్ప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. మూవీ ఈనెల 28న అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుందని ప్రకటించి.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.

ఇదిలా ఉంటే ముందుగా అనుకున్న డబ్బులు ఇవ్వబోమని.. తగ్గించాలని బయ్యర్స్ నుంచి మూవీ టీమ్‌కు ఒత్తిడి మొదలైనట్లు తెలుస్తుంది. మేకర్స్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న ఒప్పుకోవడం లేదని సమాచారం. అంతేకాదు ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బయ్యర్స్.. నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారు.

కానీ నిర్మాతలు మాత్రం మార్చ్ 22న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. దీంతో ముందుగా ఈ సినిమా ఏపీ, తెలంగాణ హక్కులు రూ. 160 కోట్లు పలకగా.. మార్చి 22న రిలీజ్ అయితే మాత్రం రూ. 120 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారట‌. మరి మేకర్స్ ఏం డిసైడ్ అవుతారు చూడాల్సి ఉంది.