ఎన్టీఆర్ ని చూడగానే మోక్షజ్ఞ ఏం చేసారో చూడండి.. బాలయ్య బిడ్డ అంటే అది..!!

నందమూరి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ పై ముద్రించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు ఎన్టీఆర్ . ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు నందమూరి పేరుకు ఉన్న క్రేజ్ డబుల్ ట్రిపుల్ చేశారే కానీ ఎవరు ఎక్కడ కూడా రవ్వంత ఇంచు కూడా తగ్గించలేదు.

కాగా నందమూరి హీరోలందరూ కలిసి ఓ ఈవెంట్లో పాల్గొంటే చూడాలి అన్నది అభిమానుల కోరిక. అయితే తెలుసో తెలియకో ఇప్పటివరకు అలాంటి మూమెంట్ రాలేదు. కానీ రీసెంట్గా నందమూరి ఆడపడుచు సుహాసిని కొడుకు పెళ్లిలో మాత్రం నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరింది . నందమూరి బాలకృష్ణ ఆయన కొడుకు మోక్షజ్ఞ ..నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావుగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ..ఇలా వరుసగా అందరూ ఆ ఫంక్షన్ లో కనిపించారు .

అంతేకాదు నందమూరి మోక్షజ్ఞ – ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కలిసి దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే ఇదే క్రమంలో ఎన్టీఆర్ ని చూడగానే మోక్షజ్ఞ చేతులెత్తి నమస్కరించి ఆప్యాయంగా పలకరించడం ఎంతో గౌరవంగా బిహేవ్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా ఇప్పుడున్న యువత కనిపిస్తే షేక్ హ్యాండ్ ఇస్తుంది ..లేదా హగ్ ఇచ్చి ముద్దులు పెడుతుంది ..కానీ బాలయ్య కొడుకు మాత్రం చాలా పద్ధతి గల వ్యక్తిగా చేతులెత్తి నమస్కరించారు. ఇదే నందమూరి సంప్రదాయం అంటూ జనాలు ఈ ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు..!!