“ముసలోడి స్టోరి”..చీప్ కామెంట్స్ తో బాలయ్య భగవంత్ కేసరి సినిమాని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో..!!

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉంటారు . కొన్నిసార్లు కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వక కావచ్చు.. మరి కొన్నిసార్లు కథ నచ్చక కావచ్చు ..కారణం ఏదైనా కానీ అలా మనం చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఆ బాధ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం.. అది అనుభవిస్తేనే తెలుస్తుంది . అయితే ఇలాంటి బాధలు మన ఇండస్ట్రీలో చాలామంది అనుభవించారు . కానీ తెలిసి తెలిసి మంచి సినిమా స్టోరీని పరమ చెత్త రీజన్తో రిజెక్ట్ చేస్తే ఆ బాధ వర్ణాతీతం.

ప్రజెంట్ అలాంటి బాధని అనుభవిస్తున్నాడు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో . సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ప్రెసెంట్ వరస బ్లాక్ బస్టర్ డిజాస్టర్లతో ఫెడవుట్ హీరోగా పేరు సంపాదించుకున్నారు . ఆయన అదృష్టమో ఏమో కానీ డైరెక్టర్లు మాత్రం ఆయనకి ఇంకా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు . అయితే ఈ హీరో వద్దకు వెళ్లి అనిల్ రావిపూడి తన ఇష్టమైన భగవంత్ కేసరి సినిమా స్టోరీ ని వివరించారట .

అయితే కథ చాలా ఓల్డ్ గా ఉండడం మరీ మాస్ ఎలివేషన్స్ ఎక్కువగా ఉండడంతో .. ఆ హీరోకి నచ్చక ఈ సినిమాని ముసలోడి స్టోరీ అంటూ రిజెక్ట్ చేశారట. అనిల్ రావిపూడి ఆ కామెంట్స్ కు బాగా హర్ట్ అయ్యారట . ఎంతో నమ్మకంతో ఆ హీరో ఈ సినిమాను యాక్సెప్ట్ చేస్తారని ఇంటికి వెళ్తే ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడంతో బాధపడ్డారట అనిల్ రావిపూడి .ఇదే విషయాన్ని తన ఫ్రెండ్ వద్ద చెప్పుకొచ్చారట.

ఈ క్రమంలోనే ఆ ఫ్రెండ్ ఈ స్టోరీ నువ్వు చెప్పిన హీరో కంటే బాలయ్యకు ఇంకా బాగుంటుంది ట్రై చెయ్ అంటూ సజెస్ట్ చేశారట . ఆ ఫ్రెండ్ పుణ్యమాంటూ బాలయ్యకు ఆ స్టోరీ వివరించారు అనిల్ రావిపూడి . స్పాట్లోనే అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసి బాలయ్య తన నిజాయితీని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది . సినిమా కూడా రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్స్ అందుకుంటుంది అనడంలో సందేహం లేదు . తెలిసి తెలిసి ఓ మంచి సినిమాను మిస్ చేసుకున్నాడు ఆ తెలుగు హీరో అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!