రామ్ – శ్రీలీల “ స్కంధ‌ ” ట్రైలర్… మాస్ ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

ఎనర్జిటిక్‌ స్టార్ రామ్ పోతినేని – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ ‘ స్కంద ‘. తొలిసారి బోయపాటి శ్రీను డైరెక్షన్లో రామ్ నటించబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే సాలిడ్ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ఒకరకంగా సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు తమను సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలు రిలీజ్ అయి మంచి హిట్స్ గా నిలిచాయి.

దీందో ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈనెల 26న ఈ సినిమా ట్రైలర్ను గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అందుకు సంబంధించిన ఓ ప్రత్యేక ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారట. దీంతోపాటు ఎనర్జిటిక్ స్టార్ శ్రీ లీల హీరోయిన్గా నటించిన శ్రీ లీల ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా

ఎదురుచూస్తున్నారు.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రిన్స్ నెగటివ్ రోల్ లో నటించాడు. ఇక సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా రిలీజై ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో..? చూడాలి.