కల్కి ప్రాజెక్టులోకి రాజమౌళి ఎంట్రీ.. బొమ్మ బ్లాక్ బాస్టరే..!!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898AD.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా ఒక సైంటిఫిక్ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తూ ఉండగా.. అమితాబచ్చన్, కమ్మల్ హాసన్, దిశా పటాని సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

SS Rajamouli lauds Kalki 2898 AD teaser, has special message for 'darling'  Prabhas - India Today

ఎందుకంటే మొదటిసారి ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయడం ఒక ఎత్తు అయితే ఇందులో కమలహాసన్ మొదటిసారిగా విలన్ గా కనిపించబోతున్నారు. ఈ రెండు కాకుండా మరొక సెన్సేషనల్ విషయం ఇప్పుడు మరింత హైప్ ని పెంచేలా చేస్తోంది.. అదేమిటంటే ఈ చిత్రంలోకి డైరెక్టర్ రాజమౌళి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే రాజమౌళి కల్కి సినిమాలో జాయిన్ అయ్యాడని సమాచారం. కల్కి సినిమా సెట్ లో రాజమౌళి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరారని షూటింగ్ కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం తెగ వైరల్ గా మారుతోంది.

రాజమౌళి సినీ ఇండస్ట్రీకి మకుటం లేని మహారాజుని కూడా చెప్పవచ్చు.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పరాజయాన్ని చదివి చూడలేదు ఆస్కార్ అవార్డును కూడా అందుకొని పేరు సంపాదించిన రాజమౌళి చేస్తున్న ఎలాంటి సినిమాకైనా సరే తిరుగు లేదని అభిమానులకు అభిప్రాయం.. దీంతో కల్కి సినిమా పైన ఈ బజ్ మరింత పెరిగిపోయింది.. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన అయితే రాలేదు.. కానీ త్వరలోనే మేకర్స్ రాజమౌళి ఆన్ ద బోర్డ్ అని చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ఇదే నిజమైతే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డుతూ సృష్టించడం ఖాయమని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.