భగవంత్‌ కేసరి ఫస్ట్ సింగల్ పై అదిరిపోయే అప్డేట్..

నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతున్న మూవీ భగవంత్‌ కేసరి. కాజల్ హీరోయిన్గా, యంగ్ బ్యూటీ శ్రీ లీల కీరోల్‌ ప్లే చేస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థ‌మన్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై హరీష్ పెద్ది, సాహు గరికపాటి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైనా ఫస్ట్ గ్లింప్స్‌ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై మంచి హైప్ తెచ్చి పెట్టాయి. ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ గణేష్ ఆంతమ్‌ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సాంగ్ ప్రోమో ని ఈరోజు సాయంత్రం 4గం. 5ని రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు.

ఈ వార్తను తమ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా తెలిపిన మూవీ టీం మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా భగవంత్ కేసరి అక్టోబర్ 19 గ్రాండ్గా ఆడియన్స్ ముందుకు రాబోతుందని మరోసారి ట్యాగ్ చేశారు. ఇక ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా రిలీజైన‌ ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.