ప్రభాస్ – మారుతి మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్స్ ఇవే..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ – రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబ‌లి సినిమా తర్వాత అన్ని వరుసగా పాన్ ఇండియా మూవీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు ఏమి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి2898 సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Buzz: Prabhas making a film with Maruthi? Director clears up rumours |  Telugu Movie News - Times of India

ఈ సినిమాలో షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇక వీటితో పాటే దర్శకుడు మారుతితో ఓ యాక్షన్ కమర్షియల్ మూవీ కూడా నటిస్తున్నాడు ప్రభాస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై గ్రాండ్ లెవెల్‌లో రూపొందుతున్న ఈ మూవీ తాజాగా కొంతమేరకు షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత జరిగే నెక్స్ట్ స్కెడ్యుల్ సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాదులో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Prabhas joins the sets of Maruthi's film; see leaked pic | Telugu Movie News  - Times of India

ప్రభాస్‌తో పాటు కీరోల్స్‌లో నటించే స్టార్ నటీనటులంతా కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారట. ఈ సినిమాలో ముగ్గురు యంగ్‌ బ్యూటీస్ ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్నారు. థ‌మ‌న్‌ సంగీతమ అందిస్తున్న ఈ మూవీ గురించి త్వరలో మరిన్ని వివరాలు అధికారికంగా తెలుస్తాయి.