మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్ష‌న్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని హారిక హాసన్ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక యంగ్ బ్యూటీ శ్రీ లీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జరుపుకుంటుంది. జనవరి 12, 2024 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahesh Babu's film with SS Rajamouli is based on real events. Details inside - India Today

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకతీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమాలో నటించబోతున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్ ప‌తాకం పై కే ఎల్ నారాయణ పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే తాజా టాలీవుడ్ లో వైర‌ల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో కీరోల్‌ కోసం యంగ్ బ్యూటీ సోనాల్ చౌహాన్‌ని సంప్రదించారట మూవీ టీమ్‌.

Sonal Chauhan - IMDb

ఇంకా ఈ మూవీ స్క్రిప్ట్, స్టోరీ పూర్తిగా సిద్ధం కాలేదు. అలాగే అవి పూర్తయిన తర్వాతనే మూవీకి సంబంధించిన మిగతా వివరాలు అఫీషియల్ గా ప్రకటిస్తారు. ఇక అప్పటివరకు ఈ కాంబోలో మూవీకి సంబంధించిన న్యూస్ ఏది వైరల్ అయినా అవి కేవలం పుకార్లు మాత్రమే అని జక్కన్న టీమ్‌ అనౌన్స్ చేస్తున్నారట. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియాలంటే కొన్ని నెలలు ఎదురుచూడాల్సిందే.