సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అయితే అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఇలా సక్సెస్ అయిన వారు చాలా కష్టపడుతూ అభిమానుల కోసం పలు రకాల విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సినిమాలలో హీరోలుగా నటిస్తున్న నటుల మధ్య కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి అలాగే హీరోయిన్ల మధ్య కూడా ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న రమ్యకృష్ణ మరొక హీరోయిన్ మీనా కి కొంత ఇగో ప్రాబ్లం ఉండేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించేవి..
అందుకే వీరిద్దరూ కలిసి ఎక్కువగా సినిమాలలో నటించలేదని న్యూస్ కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉండేది.. అయితే అప్పట్లో వీరిద్దరు కూడా స్టార్ హీరోయిన్లుగా కొన్ని సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలగడమే కాకుండా స్టార్ హీరోల సరసన నటించారు. వీరిద్దరి మధ్య ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగిందా అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు కానీ రమ్యకృష్ణకు, మీనాకు అసలు పడేది కాదట.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రమ్యకృష్ణ బాహుబలి లాంటి పెద్ద సినిమాతో మంచి క్రేజీ ను అందుకుంది.
ఇక మీనా కూడా దృశ్యం సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఇద్దరు కూడా సెకండ్ డేన్స్ లో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్నారు. రీసెంట్గా మీనా భర్త కూడా మరణించడంతో ఆమె చాలా కృంగిపోయింది.. మరి రాబోయే రోజుల్లోనైనా మీనా రమ్యకృష్ణ మధ్య ఎందుకు విభేదాలు ఉన్నాయని విషయం తెలియచేస్తారేమో చూడాలి మరి.