ఆలియా భట్ ఆస్తి విలువ ఎన్ని కొట్లో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

RRR చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ఆలియా భట్.. ఆ తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటించి మంచి క్రేజ్ ను అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ ని కరుణ్ జోహార్ వెండితెరకు పరిచయం చేశారు. 1999లో సంఘర్స్ అనే చిత్రంతో బాలనటిగా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ నేటితరం హీరోయిన్లలో అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించింది.

Ranbir Kapoor-Alia Bhatt open up on rumours of their next film together

ఇటీవల హార్ట్ ఆఫ్ స్టోన్ అనే చిత్రంతో ఈమె హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆలియా భట్ సినిమాలలోనే కాకుండా ఇతరస్త్ర వ్యాపారాలలో కూడా సామాజిక సేవలలో కూడా తనవంతు సహకారం అందిస్తూనే ఉంటుంది. తాజాగా ఆలియా భట్ నికర ఆస్తి విలువ USD 68.1 మిలీయన్ అంటే.. దాదాపుగా 557 కోట్ల రూపాయల ఆస్తి అన్నట్టుగా తెలుస్తోంది. ఈ డబ్బులు అన్ని కూడా సినిమాలు ఎండార్స్మెంట్లు ఇతర వ్యాపారాల నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది దాదాపుగా రూ.16 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లోని బిగ్గెస్ట్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఆలియా ఆస్తి ప్రతిరోజు కూడా పెరుగుతూనే ఉన్నది. పలురకాల బ్రాండ్ దుస్తులకు కూడా ప్రమోట్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ .. 2020లో కూడా ఒక దుస్తుల బ్రాండ్ ను కూడా ప్రారంభించింది. ఆలియా భట్ భర్త రణబీర్ కపూర్ కూడా స్టార్ హీరోగా బాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతున్నారు. హీరోగా కూడా భారీగానే సంపాదిస్తే పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు రన్బీర్ కపూర్. ఇక ఆలియా భట్ పలు రకాల సినిమా బ్యానర్ పైనే కాకుండా సన్ షైన్ ఆడపిల్లను కూడా ప్రారంభించి బాగానే సంపాదిస్తోంది.