పవన్ కళ్యాణ్ బ్రో సినిమా వివాదంపై పూనమ్ ట్వీట్ వైరల్..!!

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పలు రకాల వివాదాలకు దారితీస్తోంది. ఈ సినిమా మిక్స్డ్రిటాకును సొంతం చేసుకోవడమే కాకుండా బ్రో సినిమా కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదని పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి .గత రెండు రోజుల క్రితం వైసీపీ నేత అంబాటి రాంబాబు బ్రో సినిమాల తన పాత్రను చూపించడం పై పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది. దీంతో నిన్నటి రోజున పవన్ పెళ్లిళ్ల చుట్టూ తిరిగేటువంటి కొన్ని సినిమా టైటిల్స్ ని చెప్పి తాము కూడా సినిమాల నిర్మిస్తున్నామంటు తెలియజేశారు.

Poonam Kaur on Telugu director who pushed her into depression: He said if I  die, it's a news for a day - India Today

ఇక అంతే కాకుండా ఈ సినిమా స్క్రిప్ట్ రాసిన త్రివిక్రమ్ను కూడా ఏకిపారేయడం జరిగింది ఇక కలెక్షన్లు విషయంలో ప్రెస్ మీట్ పెట్టి మరి బ్లాక్ మనీ ని వైట్ మనీ గా మార్చుకుంటున్నారు అంటూ కూడా కౌంటర్లు వేయడం జరిగింది అంబాటి రాంబాబు. తాజాగా ఇప్పుడు హీరోయిన్ పూనమ్ కౌర్ ఒక సంచలన క్విట్ షేర్ చేయడం జరిగింది.అదేమిటంటే ఈమధ్య కాలంలో రాజకీయాలనేవి ఎంతో వినోదాత్మకంగా మారాయి ఎంటర్టైన్మెంట్ అనేది ఏమో చాలా సీరియస్ గా మారిపోయింది అంటూ ఇమే ట్వీట్ చేయడం జరిగింది.

అయితే పూనమ్ కౌర్ ఎవరిని ట్యాగ్ చేయకుండా ఈ ట్విట్ చేయడంతో కచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలోని అంబాటి రాంబాబు వివాదం అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పూనమ్ కావున తిడుతూ ఉంటే.. మిగతావారు మాత్రం మీరు కరెక్ట్ గా చెప్పారు సిస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు దారితీస్తుందని విషయం తెలియాల్సి ఉంది.