ఈ క్యూట్‌ పాప ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన స్టార్ హీరోయిన్!

పైన ఫోటోలో క్యూట్ గా క‌నిపిస్తున్న పాప ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. కుర్రాళ్ల గుండెల్లో గుడులు రేపిన స్టార్ హీరోయిన్ ఆమె. ఎక్కువగా త‌మిళ చిత్రాల్లో న‌టించానా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆమె సుప‌రిచిత‌మే. మ‌ర్చిపోలేని రూపం ఆమెది. ఎలాంటి పాత్ర‌లో అయినా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ప్ర‌తిభ ఆమె సొంతం. ఆమె కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు.. కిక్‌బాక్సర్ మ‌రియు మిక్స్​డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఆరితేరిన అందాల సివంగి.

ఇప్ప‌టికైనా ఆమె ఎవ‌రో గెస్ చేశారా.. రితికా సింగ్ అండీ బాబు. ముంబైలో జ‌న్మించిన ఈ బ్యూటీ.. చిన్న‌త‌నం నుండి తన తండ్రి మార్గదర్శకత్వంలో కిక్‌బాక్సర్‌గా మరియు మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్‌గా శిక్షణ పొందింది. సూపర్ ఫైట్ లీగ్ ప్రారంభ సీజన్‌లో పాల్గొంది. రియల్ లైఫ్ క్యారెక్టర్ తోనే రీల్ లైఫ్ కెరియర్ స్టార్ట్ చేసింది. దర్శకురాలు సుధా కొంగర తన సినిమా కోసం నిజమైన బాక్సర్​ను వెతికే క్రమంలో రితికా సింగ్ తారసపడింది.

అలా తమిళ, హిందీ భాషల్లో రూపొందించిన ద్విభాషాచిత్రం ఇరుది సుత్రు(సాలా ఖద్దూస్ – హిందీ) తో రితికా సింగ్ సినీ రంగ ప్ర‌వేశం చేసింది. తొలి సినిమాతోనే రితికా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి 63వ జాతీయ అవార్డులు వ‌చ్చాయి. ఇక ఇదే చిత్రాన్ని తెలుగులో `గురు` టైటిల్ తో రీమేక్ చేశారు. ఇక్క‌డ వెంక‌టేష్‌, రితికా న‌టించారు. తెలుగులోనూ ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత బాక్స‌ర్ అయిన రితికా కోలీవుడ్ లో వరుస సినిమాల‌తో హీరోయిన్ గా బిజీ అయిపోయింది.