సుధీర్గ కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో చెన్నై సుందరి త్రిష ఒకటి. మధ్యలో కెరీర్ కాస్త డౌన్ అయినా `పొన్నియన్ సెల్వన్`తో మళ్లీ ఈ బ్యూటీ సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే తాజాగా త్రిషకు సంబంధించి ఫ్యాన్స్ ను కలవరపెట్టే షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
అదేంటంటే.. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోకు త్రిష తల్లిగా నటించబోతోందట. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. భోళా శంకర్ అనంతరం సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలతో డైరెక్టర్‌గా మంచి బ్రేక్ అందుకున్న యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలతో చిరంజీవి మలయాళ సూపర్ హిట్ `బ్రో డాడీ` రీమేక్ చేయబోతున్నాడు.
ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల తన హోమ్ బ్యానర్ లో స్వయంగా నిర్మించబోతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష ఎంపిక అయింది. అయితే ఇందులో చిరంజీవి తనయుడి పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్ర కోసం సిద్దు జొన్నలగడ్డను తీసుకున్నారు అనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు శర్వానంద్ పేరు తెరపైకి వచ్చింది. శర్వా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయ్యాడని అంటున్నారు. అయితే శర్వాకు చిరంజీవి తండ్రిగా నటిస్తే.. త్రిష తల్లిగా కనిపించాల్సి ఉంటుంది. మరి త్రిష వంటి స్టార్ హీరోయిన్ ను యంగ్ హీరోకు తల్లిగా చేస్తే ఫ్యాన్స్ తట్టుకోగలరా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.