ఆ విషయంలో నాన్ననే మించిపోయిన మోక్షజ్ఞ.. ఎన్టీఆర్ కూడా చూసి నేర్చుకోవాల్సిందే..!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పేరే వైరల్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు చాలా బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ చాలా తక్కువ టైంలోనే చాలా స్లిమ్ గా మారిపోయి హీరోలా తయారైపోయాడు . మరికొద్ది రోజుల్లోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . ఈయన కోసం పాన్ ఇండియా రేంజ్ లో దర్శకులు సైతం సెలెక్ట్ చేస్తున్నాడు బాలయ్య . రీసెంట్గా నందమూరి ఆడపడుచు సుహాసిని కొడుకు పెళ్లిలో మెరిసాడు మోక్షజ్ఞ .

చాలా స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా ట్రెండీగా కనిపించాడు . ఇదే పెళ్లికి హాజరైన నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ తో చాలా చనువుగా క్లోజ్ గా మూవ్ అయ్యారు . అంతేకాదు మోక్షజ్ఞ బిహేవియర్ బట్టి ఆయన చాలా కంట్రోల్ పర్సన్ అంటూ పెళ్లికి హాజరైన వాళ్ళు చెప్పుకొస్తున్నారు. పెళ్లిలో చాలా హడావిడి ఉన్న పనులు ఉన్న తనదైన స్టైల్ లో చాలా కూల్ అండ్ క్లాసిక్ గా ముందుకు వెళుతూ అందరిని ప్రేమగా పలకరించుకున్నారని ..

తనా మనా అనే భేదం లేకుండా ముందుకు వచ్చాడని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు మోక్షజ్ఞ బిహేవియర్ బట్టి ఆయనకి కోపాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే బాలయ్య ఎన్టీఆర్ లకు ఎంత కోపమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టేజి పైనే ఇచ్చి పడేస్తాడు . ఆ విషయంలో కంపేర్ చేస్తే నందమూరి బాలయ్య ఎన్టీఆర్ కన్నా మోక్షజ్ఞ ఓ మెట్టు ఎక్కువగానే ఉన్నాడు . కొందరు ఫ్యాన్స్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!