తారక్ – ప్రణతి ఇంట్లో అలా పిలుచుకుంటారా..? హౌ రొమాంటిక్ కపుల్ వీళ్లు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన తారక్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు ఆ తర్వాత హిట్లు ప్లాప్లు అంటూ తేడా లేకుండా వరుస సినిమాలకు కమిట్ అయిన తారక్.. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఇండియన్ ఫిలిం హిస్టరీ కి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చాడు .

కాగా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్న తారక్.. భార్య లక్ష్మి ప్రణతితో ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే వాళ్ళకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . తారక్ ఎప్పుడు కూడా ప్రణతితో చనువుగా ఉన్న పిక్స్ షేర్ చేయడు. మరి తారక్ – ప్రణతిల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది అంటూ అభిమానులు అప్పుడప్పుడు చర్చించుకుంటూ ఉంటారు.

ఇలాంటి క్రమంలోనే తారక్-ప్రణతి చాలా క్లోజ్ గా హ్యాపీగా సరదా సరదాగా ఉంటారు అన్న విషయం బయటపడింది . అంతేకాదు ప్రణతి తారక్ ను ముద్దుగా బావ అంటూ పిలుస్తుందట. అలా పిలిస్తే తారక్ కి కూడా చాలా ఇష్టమట . నిశ్చితార్థమైన తర్వాత అలా పిలవమంటూ స్వయంగా ప్రణతితో తారక్ నే చెప్పుకొచ్చారట . దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!