వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ల జాబితాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకటి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ.. 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను మనువాడింది. వివాహం అనంతరం పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే ఓ బిడ్డకు తల్లైంది.
గత ఏడాది ఆరంభంలో కాజల్ కు పండంటి మగ బిడ్డ జన్మించగా.. నీల్ కిచ్లూ అంటూ కుమారుడికి నామకరణం చేశారు. అలాగే బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టి నాజూగ్గా మారింది. మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో బాలకృష్ణ `భగవంత్ కేసరి` ఒకటి కాగా.. మరొకటి కమల్ హాసన్ `ఇండియన్ 2`. వీటితో పాటు సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ అయింది.
ఇకపోతే సోషల్ మీడియాలోనూ కాజల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ స్టన్నింగ్ ఫోటో షూట్లతో నెటిజన్లను అల్లాడించేస్తుంటుంది. తల్లైనా కూడా స్కిన్ షో విషయంలో చందమామ అస్సలు తగ్గట్లేదు. తాజాగా మరోసారి ఈ భామ తన అందాలతో అందరినీ ఆకర్షించింది. రెడ్ కలర్ శారీలో యమా హాట్ గా దర్శనమిచ్చింది. పైట చాటున దాగనంటున్న పరువాలతో పరేషాన్ చేసింది. కసి కళ్లతో కాకరేపింది. కాజల్ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram