పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన త‌మ‌న్నా.. అంటే విజ‌య్ వ‌ర్మతో డేటింగ్ టైమ్ పాస్‌కేనా..?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బోల్డ్ వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్ 2` షూటింగ్ స‌మ‌యంలో విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నాకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో.. ఇద్ద‌రూ డేటింగ్ లో మునిగితేలుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మ‌ని న‌మ్మారు.

కానీ, తాజాగా త‌మ‌న్నా పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చింది. ప్ర‌స్తుతం త‌మ‌న్నా ఓవైపు భోళా శంక‌ర్‌, మ‌రోవైపు జైల‌ర్ ప్ర‌మోష‌న్స్ తో ఫుల్ బిజీగా గడుపుతున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన భోళా శంక‌ర్‌, రజ‌నీకాంత్ జైల‌ర్ ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. రెండు సినిమాల్లోనూ త‌మ‌న్నానే హీరోయిన్ కావ‌డంతో.. ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది.

అయితే భోళా శంక‌ర్ ను ప్ర‌మోట్ చేసేందుకు మిల్కీ బ్యూటీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా సినిమాకు సంబంధించి అనేక విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే పెళ్లి గురించి ప్ర‌స్తావ‌న రాగా.. త‌మ‌న్నా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేద‌ని.. ఫోక‌స్ మొత్తం కెరీర్ పైనే ఉంద‌ని.. ఒకవేళ పెళ్లిని ప్లాన్ చేసుకుంటే త‌ప్పకుండా చెప్తాన‌ని త‌మ‌న్నా పేర్కొంది. దీంతో నెటిజ‌న్లు త‌మ‌న్నాపై సెటైర్లు పేలుస్తున్నారు. పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేదంటే.. విజ‌య్ వ‌ర్మ‌తో డేటింగ్ టైమ్ పాస్‌కేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏ వ‌య‌సులో జ‌రిగే ముచ్చ‌ట ఆ వ‌య‌సులో జ‌ర‌గాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.