సినిమా హిట్ అవ్వాలంటే .. బట్టలు విప్పి తిరగాలా..? ఎన్టీఆర్ ఏం విప్పితే హిట్ కొట్టాడు..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ బూతు సినిమా అయిపోతుంది. మరి ముఖ్యంగా ఓ సినిమాని డైరెక్ట్ చేయడం పెద్ద విషయం కాదు.. ఆ సినిమాను డైరెక్టర్ చేసిన తర్వాత జనాల్లోకి తీసుకెళ్లడం మరింత తలనొప్పులుగా మారింది. ఈ క్రమంలోనే పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కాలానికి రకరకాల స్ట్రాటజీలను ఫాలో అవుతున్నారు డైరెక్టర్స్ . కాగా రీసెంట్గా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా స్టేజ్ పై ఎంత హాట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారో మనకు తెలిసిందే.

విజయ్ దేవరకొండ అయితే ఏకంగా షర్ట్ తీసేసి హీరోయిన్ సమంత ని ఎత్తుకొని గిరిగిరా తిప్పేశారు . ఆ తర్వాత ఇది జరిగిన 24 గంటలు కాకముందే హీరో విశ్వక్సేన్ నేహ శెట్టి ఏకంగా స్టేజ్ పై చీర విప్పేసి హాట్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు . దీంతో సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ..? సినిమా ఆడాలంటే ఇలా బట్టలు విప్పుకొని తిరగాలా..? అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు కొంతమంది జనాలు సినిమా హిట్ అవ్వడం కోసం ఇలా బోల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చేవాళ్లను ఏకీపారిస్తున్నారు .

అంతేకాదు ఈ మధ్యకాలంలో హిట్ అయినా బలగం , కాంతారా, జైలర్ సినిమాలలో ఇలా ఏం బోల్డ్ పర్ఫామెన్స్ లేవు .. మరి ఆ సినిమాలు ఎందుకు హీట్ అయ్యాయి..? అంటూ ప్రశ్నిస్తున్నారు . బలగం సినిమాలో బట్టలిప్పి తిరిగితేనే ఆడిందా..? కాంతారాలో ఏ కాంతని చూసి హిట్ చేశారు..? నిన్న కాక మొన్న వచ్చిన జైలర్లో హీరోకి ఏ సిక్స్ ప్యాక్స్ ఉందని హిట్ చేశారు..? ప్రేక్షకులను అంత తక్కువ అంచనా వేయకండి ..సినిమాలో కథ ఉండాలి ..ఆ కథ కంటెంట్ ఉంటేనే సినిమా జనాలకి నచ్చుతుంది.

స్టేజ్ పైకి వచ్చి బట్టలు విప్పి ముద్దులు పెట్టుకుంటే సినిమా హిట్ అయిపోదు. అంత ఎందుకు గతంలో హీరో హీరోయిన్లు ఇలాంటి చెత్త పనులు స్టేజిపై చేస్తేనే హిట్ అయ్యాయా ..? ఇప్పుడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు ధమిడికి కూడా పనికి రావడం లేదు . అప్పట్లో లవకుశ సినిమా టికెట్ కేవలం పావల.. అంటే పావలా కానీ కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎందుకు ..?విడుదల అయిన అన్ని సెంటర్లలో వంద రోజులు ఆడింది..? దానికి కారణం వాళ్ళు ఏమన్నా బట్టలిప్పి తిరిగారా..? సినిమాలోని కథ కంటెంట్ ..బనియన్లు వేసుకుంటేనే ఎగేసుకొని చూస్తారు అనుకోవడం మీ భ్రమ . ఇకనైనా మారండి . బట్టలేసుకోవడమే రానోళ్లు బ్లాస్ట్ అవ్వడం తప్ప బ్లాక్ బస్టర్లు కాలేరు ..అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మొత్తానికి విజయ్ సమంత పెర్ఫార్మెన్స్ సినిమా ఇండస్ట్రీని బ్రష్టు పట్టిస్తుంది అంటూ జనాలు మండిపడుతున్నారు. ఇకనైనా ఈ సినిమా స్ట్రాటజీలు మానుకొని కథ విషయంలో కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు..!!