మరికొద్ది గంటల్లో చనిపోతాను అని తెలిసిన ఎన్టీఆర్ ..ఏం చేసాడొ తెలుసా..? నిజంగా మహానుభావుడు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..ఎన్ని కుటుంబాలు వచ్చినా ..ఎంత మంది పాన్ ఇండియా హీరోలుగా మారి ఆస్కార్ అవార్డులు ..నంది అవార్డులు తీసుకొచ్చిన నందమూరి తారక రామారావు గారికి ఉన్న ప్రత్యేక గుర్తింపు మరి ఎవరికి రాదని చెప్పాలి . ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు గడిచినా ఆయన స్థానం ఆయనదే. కాగ అలాంటి ఎన్టీఆర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే . రీసెంట్గా ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో చేసిన పనులు అలాగే ఆయన పడిన బాధకు సంబంధించిన విషయాలు మరోసారి ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు .

నందమూరి తారక రామారావు గారు మరికొద్ది గంటల్లో చనిపోతారు అని తెలిసినప్పుడు ఆయన లాస్ట్ గా చేసిన ఫోన్ ఆయన ప్రాణ స్నేహితుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే అక్కినేని నాగేశ్వరరావు గారు నందమూరి తారకరామారావు గారు జాన్ జిగిడి దోస్తులు. ఇండస్ట్రీ ఈ స్థానంలో నిలబడటానికి కారణం వాళ్ళిద్దరే ..అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారి మధ్య అప్పట్లో ఉండే కొందరు వ్యక్తులు చిచ్చులు పెట్టారు .

ఈ క్రమంలోనే లాస్ట్ రోజుల్లో ఇద్దరు మాట్లాడుకోలేదు. అయితే ఫైనల్లీ ఎన్టీఆర్ – నాగేశ్వరరావు గారికి కాల్ చేసి” నీతో మాట్లాడాలని ఉంది .. నీతో కలిసి భోజనం చేయాలని ఉంది.. ఇంటికి రా” అంటూ ఫోన్ చేశారట . అయితే నాగేశ్వరరావు కూడా ” వస్తున్నాను” అంటూ చెప్పి ఫోన్ కట్ చేశారు . అయితే అలా కట్ చేసిన కొద్ది నిమిషాలకి రామారావు గారు మరణించారు అన్న వార్త అక్కినేని నాగేశ్వరరావు గారికి చేరింది . ఈ విషయం తెలిసే ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారట . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది..!!