“క్లీం కార”ను చూడటానికి ఇప్పటి వరకు తారక్ ఎందుకు వెళ్లలేదో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ..మంచి మనిషి అన్న పేరు ఎప్పటినుంచో ఉంది . ఆ విషయంలో నాన్నకు తగ్గ కొడుకుగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్నాడు రామ్ చరణ్ . రీసెంట్ గానే రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది.

బారసాల చేసి ఆమెకు “క్లీం కార” అంటూ నామకరణం కూడా చేశారు . అయితే రామ్ చరణ్ కు ఎంతో జాన్ జిగిడి దోస్త్ ల భావించే తారక్ ఇప్పటివరకు క్లీం కార ను చూడడానికి చరణ్ ఇంటికి వెళ్లలేదు . ఏవో గిఫ్ట్ ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది తప్పిస్తే .. ఇప్పటివరకు దానిపై అటు మెగా ఫ్యామిలీ ఇటు నందమూరి ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వలేదు . అంతేకాదు అప్పుడెప్పుడో క్లింకార పుట్టినప్పుడు ఒక్క మెసేజ్ చేసి విషెస్ చెప్పిన తారక్.. ఇంతవరకు చరణ్ తో కలిసినట్లు గాని మాట్లాడినట్లు గాని ఎక్కడ వార్తలు వినిపించలేదు .

ఈ క్రమంలోనే చరణ్ నా బ్రదర్ లాంటివాడు అని ఎన్నోసార్లు చెప్పిన తారక్ ఎందుకు క్లింకారా ను చూడడానికి వెళ్ళలేదు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే చిన్నపిల్లలకి త్వరగా సిక్ అవుతారని పలు షూటింగ్స్ లో బిజీగా ఉండే హీరోస్ ఆమెను టచ్ చేయడం కానీ ఆమె దగ్గరకు వెళ్లడం కానీ అంత సేఫ్ కాదని ఈ కారణంగానే ఆమెను చూడడానికి వెళ్ళలేదు అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!