సుకుమార్ చేత అలాంటి ప్రామిస్ చేయించుకున్న బన్నీ.. అమ్మ దంగ అసలు మ్యాటర్ ఇదా ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . రీసెంట్ గానే ఆయన నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వరించింది. పుష్ప సినిమాలో ఆయన నటించిన పర్ఫామెన్స్ గాను ఈ అవార్డు వరించింది. దీంతో సోషల్ మీడియాలో బన్నికి సంబంధించిన పలు వార్తలు ట్రెండింగ్ లోకి వస్తున్నాయి . ఈ క్రమంలోనే బన్నీ సుకుమార్ చేత చేయించుకున్న ప్రామిస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

వీళ్లిద్దరి కాంబోలో ఫస్ట్ సినిమా ఆర్య . ఈ సినిమాల్లో ఇంట్రడక్షన్ సీన్ అప్పుడు హీరోయిన్ పట్టిలు నదిలో పడిపోతే హీరో దాని కోసం దూకుతాడు. అయితే ఈ సీన్ రిహార్సస్ కోసం సుకుమార్ సీన్ వివరిస్తూ ఉండగా పొరపాటున సుకుమార్ నీళ్లలో పడిపోయారట . అయితే సుకుమార్ కి ఈతరాదు ఈ విషయం అక్కడ ఉండే వారికి కూడా తెలియదు. ఈ క్రమంలోనే సుకుమార్ కి ఈత వచ్చు అనుకున్న చాలా మంది ఆయన ఎలాగోలా బయటపడతారు అంటూ వెయిట్ చేశారట ,

కానీ ఫైనల్లి సుకుమార్ కి ఈతరాదు అని తెలుసుకొని అల్లు అర్జున్ వెంటనే నదిలోకి దూకి ఆయనను కాపాడారట . అంతేకాదు చాలా కష్టపడి అల్లు అర్జున్ – సుకుమార్ ని సేవ్ చేశారట. ఇదే క్రమంలో చచ్చిపోయాను అనుకున్నాను బన్నీ కాపాడినందుకు థాంక్యూ సో మచ్ అంటూ సుకుమార్ అల్లు అర్జున్ కి.. థాంక్స్ చెప్తూ ఉండగా నీ కృతజ్ఞతలు ఏమి అక్కర్లేదు ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దు ముందు స్విమ్మింగ్ నేర్చుకో అంటూ సజెస్ట్ చేశారట . అంతేకాదు సరేలే నీ థాంక్స్ నాకేం అక్కర్లేదు కానీ నాకు ఒక రెండు మూడు హిట్ సినిమాలు ఇవ్వు అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారట . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఆరోజు సరదాగా చేసిన ప్రామిస్ నిజంగానే అల్లు అర్జున్ కు నిలబెట్టాడు సుకుమార్ . ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సూపర్ సూపర్ హిట్ అయ్యాయి..!!