సర్జరీకి ముందు అల్లు అర్జున్ ఎలా ఉండేవారో తెలుసా.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రం అందంగా కనిపించడం కోసం పలు రకాల సర్జరీలు చేయించుకున్నట్లు అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా సర్జరీకి ముందు ఫోటోలు సర్జరీ తర్వాత ఫోటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ ఫోటోలు ట్రోల్ కి కూడా గురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సంబంధించి ఒక పాత ఫోటో వైరల్ గా మారుతోంది.

Allu Arjun Trolled For Alleged Cosmetic Surgeries, Netizen Says, 'Actor  Corrected His Nose And Jaw'

ఇందులో అల్లు అర్జున్ ని చూసి దారుణంగా ట్రోల్ చేయడం జరుగుతోంది.. ఇంతకు ఈ ఫోటోలో ఎలా ఉన్నారో తెలుసుకుందాం..అల్లు అర్జున్ విషయానికి వస్తే.. మొదటిసారి అల్లు అర్జున్ బాల నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత చిరంజీవి నటించిన డాడీ సినిమాలో అతిధి పాత్రలో నటించారు. 2003లో గంగోత్రి సినిమా ద్వారా మొదటిసారి హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తన తొలి సినిమాతోనే నటనపరంగా సక్సెస్ అయ్యారు.

Allu Arjun serves good looks in a white shirt at Baby success meet; watch  VIDEO | PINKVILLA

ఆ తర్వాత ఆర్య, బన్నీ, దేశముదురు , వేదం తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఆ వెంటనే కొన్ని సినిమాలు నిరాశపరిచిన ఆ తర్వాత మంచి మంచి చిత్రాలలో నటించారు. పుష్ప సినిమాతో పాండ్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన అల్లు అర్జున్ జాతీ అవార్డును కూడా అందుకున్నారు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అందరికీ సుపరిచితమే వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు..

అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఆయన ఫేస్ చూసి చాలామంది విమర్శలు చేశారట.. దీంతో అల్లు అర్జున్ అవన్నీ తట్టుకోలేక ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నాడట.. ఆ తర్వాతే చూడడానికి ఒక తీరుగా కనిపించే వారిని తెలుస్తోంది. అయితే గతంలో ఒక ఫోటో ట్విట్టర్లో వైరల్ గా మారుతూ ఉండడంతో ఈ ఫోటోను చూసిన నెటిజెన్స్ సైతం మళ్ళి ట్రోల్ చేస్తున్నారు.