అబ్బాస్ సంచ‌ల‌నం.. బిగ్ బాస్ 7కు మాజీ ల‌వ‌ర్ బాయ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 7 త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. సెప్టెంబ‌ర్ 3వ తేదీన ఈ షో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కంటెస్టెంట్స్ ను ఫైన‌ల్ చేశారు. గ‌త రెండు సీజ‌న్లు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు.

ఈ నేప‌థ్యంలోనే బిగ్ బాస్ సీజ‌న్ 7ను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని కొత్త ముఖాలు కాకుండా.. పాపుల‌ర్ సెల‌బ్రెటీల‌ను హౌస్ లోకి దింపుతున్నారు. ఈ లిస్ట్ లో ఒక‌ప్ప‌టి స్టార్ హీరో అబ్బాస్ ఒక‌డు. ప్రేమ దేశం సినిమాతో ల‌వ‌ర్ బాయ్ గా విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న అబ్బాస్ బిగ్ బాస్ 7న సంద‌డి చేయ‌బోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. హీరోగా ఫేడౌట్ అయిన త‌ర్వాత ఈయ‌న ఫ్యామిలీతో న్యూయార్క్ లో సెటిల్ అయ్యాడు. అక్క‌డ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఈయ‌న స‌డెన్ గా ఫ్యామిలీతో ఇండియాకు వ‌చ్చాడు.

అంతేకాదు వ‌రుస‌గా యూట్యూబ్ ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ ప్రేక్ష‌కుల‌కు చేర‌వ‌వుతున్నాడు. అయితే ఈ హ‌డావుడి అంత బిగ్ బాస్ కోస‌మే అట‌. నిర్వాహ‌కుల నుండి పిలుపు రావ‌డం వ‌ల్లే ఆయ‌న ఇండియాకు వ‌చ్చాడ‌ని టాక్ న‌డుస్తోంది. అంతేకాదు, బిగ్ బాస్ 7కు అబ్బాస్ షాకింగ్ రెమ్యున‌రేష‌న్ తీసుకోబోతున్నాడ‌ట‌. వారానికి రూ. 1.75 ల‌క్ష‌లు అబ్బాస్ ఛార్జ్ చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. తెలుగులో బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఇంత‌వ‌ర‌కు ఏ కంటెస్టెంట్ కు ఈ రేంజ్ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేదు. కానీ, రూ. 1.75 ల‌క్ష‌లు ఇచ్చి మాజీ ల‌వ‌ర్ బాయ్ ను దించుతున్నారు అంటే ఈసారి షో ఎంత ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుందో అర్థం చేసుకోవ‌చ్చు. కాగా, అబ్బాస్ బిగ్ బాస్ ద్వారా కంబ్యాక్ ఇవ్వాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు. బిగ్ బాస్ త‌ర్వాత మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో బిజీ అవ్వాల‌ని భావిస్తున్నట్లు టాక్‌.