మూడో పెళ్లి అంటూ ఇద్ద‌రు మాజీ భార్యలతో అలా చేసిన అమీర్ ఖాన్..!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్.. స్టార్ హీరో అమెరికన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా మూడో పెళ్లి చేసుకోవడానికి అమీర్ ఖాన్ రెడీ అయ్యాడు అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే అలాంటిదేమీ జరగదు అన్నట్లు ప్రస్తుతం వాతావరణం కనిపిస్తుంది.

అమీర్ ఖాన్ కజిన్ బ్రదర్ మన్సూర్ ఖాన్ బుక్ లాంచ్ ఈవెంట్ కు మాజీ భార్య తన కొడుకుతో రావడమే ఇందుకు కారణం. పైగా అమీర్ భార్యలు రీనాద‌త్త‌, కిరణ్ రావు జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఈ పార్టీలో కనిపించారు. ఇక వీరిద్దరూ ఇంత హ్యాపీగా నవ్వుకుంటూ కనిపించడంతో థర్డ్ మ్యారేజ్ రూమర్స్ ఫేక్ అని నేటిజన్స్ భావిస్తున్నారు.

1986లో రీనాను పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్ పదహారేళ్ల కాపురం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి కిరణ్ రావు తో రెండో వివాహం చేసుకున్నాడు. కానీ ఏడాది క్రితం ఆమెకు కూడా డివోర్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ ఫ్యామిలీ మొత్తం ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మంచి ఫ్రెండ్లీగా ఉంటున్నారట. దీంతో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోయేది లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)