ఖుషి.. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. విజయ్ దేవరకొండ, సమంత ఇందులో జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ఇందులో కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఇకపోతే తాజాగా ఖుషికి సంబంధించి ఓ షాకింగ్ వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఖుషి మూవీతో సమంత రియల్ లైఫ్ కి కనెక్షన్ ఉంటుందట. సమంత రియల్ లైఫ్ స్టోరీని ఆధారంగా తీసుకునే శివ నిర్వాణ ఖుషి మూవీని తెరకెక్కించాడంటూ ఇండస్ట్రీలో జోరుగా చర్చలు జరుగుతోంది.
రెండు వేరు వేరు కులాలకి, మతాలకి చెందిన అమ్మాయి-అబ్బాయి లవ్ లో పడడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. ఆపై మనస్పర్థలు రావడంతో విడాకులకు అప్లై చేయడం వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమైంది. సరిగ్గా గమనిస్తే సమంత లైఫ్ లోనూ ఇదే జరిగింది. వేరువేరు కులాలకి మతాలకి చెందిన నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లై నాలుగేళ్లు కాకముందే విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే వీరి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ లో కొన్నిటిని ఖుషిలో శివ నిర్వాణ చాలా రియలిస్టిక్‌గా చూపించబోతున్నాడట. అవి సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని కూడా అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.