లావ‌ణ్య‌తో ఎప్పుడో ప్రేమ‌లో ప‌డ్డాడో చెప్పిన వ‌రుణ్ తేజ్‌… ఆ తొలి చూపు సీక్రెట్ ఇదే..!

ఇటీవల గాండీవధారి అర్జున్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. నేను యాక్టింగ్ ఎంజాయ్ చేస్తాను.. కాబట్టే ఈ రంగంలోకి వచ్చాను. నా వర్క్ ఏదైనా నేను ఎంజాయ్ చేస్తూ చేయాలని అనుకుంటాను. అలాగే గాంఢీవ‌ధారి అర్జున్ సినిమా కథ విన్నప్పుడు ఆ సినిమా భావోద్వేగాలు నాకు బాగా నచ్చాయి. వరుణ్ సత్తార్ సినిమాలు నేను చాలాకాలం నుంచి చూస్తూన్నాను. ఆయన చేసిన సినిమాలలో చందమామ కథలు భావోద్వేగాలు, పిఎస్‌పీ గరుడవేగ సినిమాలో యాక్షన్ నాకు చాలా నచ్చాయి. గని సినిమా టైంలో ఈ మూవీ కధ‌ నేను విన్నాను అంటే వివ‌రించాడు.

సాధారణంగా స్టైలిష్ యాక్షన్ మూవీ అంటే యాక్షన్, స్టైలిష్ అంశాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రవీణ్ సర్దార్ గారు చెప్పినప్పుడు అందులో భావోద్వేగాలు,పాయింట్ బాగా నచ్చింది. ఇందులో నా పేరు అర్జున్. ఓ నటుడు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పాత్రలు నటించ‌డానికి చాలా తక్కువగా అవకాశాలు దొరుకుతాయని అలాంటి మంచి అవకాశం నాకు దక్కింది దాంతో పాట్టే ఈ సినిమాను చేయడం సంతోషంగా అనిపించింది.. ఈ సినిమాలో ఎక్కువగా రియల్స్టిక్‌ యాక్షన్ సీక్వెన్స్‌లే ఉన్నాయి. నాకు గాయాలు అయ్యాయి అని వివరించాడు. ఇక సాక్షి వైద్య చాలా టాలెంటెడ్‌. తొలిరోజు షూటింగ్లోనే సినిమాలోని మూడు పేజీల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పేసింది అన్నాడు.

అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మిక్కీ జై మేయర్ అద్భుతమైన సంగీతం అంతకుమించి నేపథ్య సంగీతం అందించాడు. ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాల్లో నేను నటిస్తున్నానంటూ వివరించాడు. ఇందులో భాగంగా ఇంటర్వ్యూవ‌ర్‌ లావణ్యతో మీ ప్రేమ ఎప్పుడు మొదలైంది పెళ్లెప్పుడు అని అడ‌గ‌గా.. వరుణ్ తేజ తొలిసారి తనని చూసినప్పుడే అంటూ నవ్వుకుంటూ సమాధానం ఇచ్చాడు. అంటే మిస్టర్ సినిమా షూటింగ్ లో ఫస్ట్ టైం లావణ్యను చూసినప్పుడు. మా పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.