అమ్మ బాబోయ్‌.. `ఇండియా డే పరేడ్‌`లో సమంత ధ‌రించిన డ్రెస్ అంత కాస్ట్లీనా..?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం న్యూయార్క్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయర్క్‌లో `ఇండియా డే పరేడ్` వేడుకల‌ను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆగ‌స్టు 20వ తేదీన 41వ ఇండియా డే పరేడ్ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ వేడుకుల‌కు హాజ‌రు కావాలంటే స‌మంత‌కు ఆహ్వానం అంద‌డంతో.. ఆమె పాల్గొంది.

స‌మంత‌తో పాటు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇండియా డే పరేడ్ కు అటెండ్ అయ్యారు. న్యూయార్క్‌ వీధుల్లో సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆల్రెడీ నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఇండియా డే పరేడ్ లో సమంత ధ‌రించిన డ్రెస్ కాస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎంబ్రాయిడరీ కార్సెట్, ప్యాంటు మరియు జాకెట్ సెట్‌ను స‌మంత ధ‌రించింది. రీతూ కుమార్ ఈ డ్రెస్ ను డిజైన్ చేశారు. చాలా క‌ల‌ర్ ఫుల్ గా ఉన్న ఈ డ్రెస్ లో స‌మంత స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. అయితే ఈ డ్రెస్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోతుంది. ఎందుకంటే, స‌మంత అవుట్‌ఫిట్ ఖ‌రీదు అక్ష‌రాల రూ. 2.95 ల‌క్ష‌లు. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు ఒక డ్రెస్ కోసం స‌మంత అంత ఖ‌ర్చు పెట్టిందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా, స‌మంత త్వ‌ర‌లోనే ఖుషి మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. సెప్టెంబ‌ర్ 1న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌గా హీరోగా న‌టించారు. గ‌త చిత్రం శాకుంత‌లంతో అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచిన స‌మంత‌.. ఖుషితో హిట్ కొడ‌తుందా లేదా అన్న‌ది చూడాలి.