హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న వనిత విజయ్ కుమార్ కూతురు.. సక్సెస్ అయ్యేనా..?

సీనియర్ నటులు విజయ్ కుమార్ , మంజుల దంపతుల కుమార్తె నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. దేవి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్ వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. మొదట ఈమె టెలివిజన్ యాక్టర్ అయిన ఆకాశ్ ను వివాహం చేసుకున్నది. వీరిద్దరికీ విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.. ఇప్పుడు వనిత విజయ్ కుమార్ జోవిక హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఇటీవల ఈ విషయాన్ని వనిత విజయ్ కుమార్ షేర్ చేయడం జరిగింది. ఇటీవల తన 18వ పుట్టినరోజు జరుపుకున్న వనిత విజయ్ కుమార్తె జోవిక తమిళ సినీ ప్రపంచంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చడానికి సిద్ధంగా ఉందని తెలియజేసింది. ఈ మేరకు తమిళ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.. వనిత విజయ్ కుమార్ కూడా తన కూతురు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తుందని ఇప్పటికే మేము కొన్ని కథలు వింటున్నామని కూడా తెలియజేసింది.

వాస్తవానికి జోవిక ముంబైలోని అనుపమ్ కేర్ యాక్టింగ్ స్కూల్లో ఏడాది పాటు శిక్షణ తీసుకుందని, కానీ జోవికాను హీరోయిన్గా నటింపచేయడమా.. లేక కీలకమైన పాత్రలో నటింపచేయాల అనే ఆలోచనలో ఉన్నామని తెలియజేసింది. సినిమాలో కాంబినేషన్ పక్కనపెట్టి కథ బాగుంటే ఎలా అయినా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలియజేస్తుంది వనిత విజయ్ కుమార్. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం వనిత కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు సైతం చూడడానికి అందంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అంటూ తెలియజేస్తున్నారు.