ఎవ‌రితో అయినా రిలేష‌న్లో ఉన్నావా…. దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిన సుప్రీత..!

టాలీవుడ్ డైరెక్టర్ సురేఖ వాణి కూతురు సుప్రియ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ను మించి ఘాటు ఫోటోషూట్స్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. తల్లి సురేఖతో కలిసి పొట్టి బట్టలు వేసుకుని డాన్స్ చేస్తూ రీల్స్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఈ తల్లి, కూతుర్లు కాస్త ఖాళీ సమయం దొరికిందంటే ఫారెన్‌లో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఆ హ్యాపీనెస్‌ని ఫాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఇక తాజాగా ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయం అవడానికి సుప్రీత ప్రయత్నాలు చేస్తుంది. ఈ తల్లి, కూతుర్లపై ఎప్పటికప్పుడు నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మాత్రం సుప్రితా సహించదు. ఘాటుగా స్పందిస్తుంది.. లైవ్ లోనే బండ బూతులు తిట్టేస్తుంది. 22 ఏళ్ళ వయసున్నా.. సుప్రిత ఎక్స్పోజింగ్ లో మాత్రం లిమిట్స్ పెట్టుకోలేదు. ఇక సుప్రీత తన పెళ్లి కాకముందే తల్లికి ఓ మంచి లైఫ్ ఇవ్వాలని గతంలో కొన్నిసార్లు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

 

ఇదంతా పక్కన పెడితే తాజాగా సుప్రీత తన ఫాలోవర్స్ తో లైవ్ చాట్ చేసింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది. ఓ నెటిజన్ ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అంటూ అడగడంతో ఇష్.. అని చిరాకుగా ఎక్స్ప్రెషన్ పెట్టింది. దీన్ని బట్టి ఆమె ఎటువంటి రిలేషన్ లో లేదని అర్థమవుతుంది. కానీ గతంలో ఈ బ్యూటీ ఓ అబ్బాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు కొన్ని క్లోజ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరికి మధ్యన బ్రేకప్ జరిగి ఉంటుంది అంటూ నేటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.