“తమన్నాతో పెళ్లి.. ఇంట్లో టార్చర్ చూపిస్తున్నారు”.. విజయ్ వర్మ ఎన్ ఎక్స్పెక్టెడ్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మిల్కీ బ్యూటీగా పాపులారిటి సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు.. యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రాణించింది . ఈ క్రమంలోనే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రిలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా రాజ్యమేలేసిన తమన్నా రీసెంట్ గానే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నాను అని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది .

వీళ్ళిద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 బాగా హిట్ అయింది . అంతేకాదు తమన్నా విజయ్ వర్మ ల కెమిస్ట్రీ కూడా సూపర్ అంటూ జనాలు కామెంట్స్ చేశారు . ఇలాంటి క్రమంలోనే త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అని జనాలు భావిస్తున్న టైం లో ..ఇప్పుడే పెళ్లి చేసుకోమంటూ తమన్నా ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అయితే రీసెంట్ గా ఓ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడిన విజయవర్మ మాత్రం త్వరగా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నామంటూ హింట్ ఇచ్చేశాడు .

ఆయన మాట్లాడుతూ..” మా ఇంటికి కాల్ చేస్తే చాలు నన్ను పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అంటూ టార్చర్ చేస్తున్నారు ..ఇన్నాళ్లు ఒక ఎత్తు ఇప్పుడు అమ్మాయి కూడా దొరికింది.. నువ్వు ఖాళీగానే ఉన్నావు.. ఇన్నాళ్లు అంటే సినిమాలు బిజీబిజీ అన్నావ్ ..ఇప్పుడు ఖాళీ గానే ఉన్నావుగా పెళ్లి చేసుకో అంటూ టార్చర్ చూపిస్తున్నారు . నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది ఇన్నాళ్లు విజయవర్మ అంటే విలన్ గా గుర్తించేవారు ..కానీ నాలోని రొమాంటిక్ యాంగిల్ ని బయటపెట్టింది తమన్నా ” అంటూ నాటీ కామెంట్స్ చేశాడు. అంతేకాదు విజయ్ వర్మ మాటలు చూస్తుంటే త్వరలోనే పెళ్లి గుడ్ న్యూస్ చెప్పేలానే ఉన్నారు అంటున్నారు అభిమానులు..!!