నీచానికి దిగిపోయిన త్రివిక్రమ్- రానా.. గుణశేఖర్ సంచలన ట్వీట్..!!

టాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్లలో డైరెక్టర్ గుణశేఖర్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. నేషనల్ అవార్డు విన్నర్ లలో ఒక్కడిగా నిలవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎన్నో హీట్ సినిమాలను అందించారు. గుణశేఖర్ 30 ఏళ్ల కెరియర్లో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ గుణశేఖర్ అంటే ఎక్కువగా భారీ సెట్స్ అని పిలుస్తూ ఉంటారు. అలా ఒక్కడు చిత్రంలో చార్మినార్ సెట్ అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి టెంపుల్ సెట్స్ గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో గుణశేఖర్ తెరకెక్కించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి.

Gunasekhar announces 'Hiranyakashyapa' with Rana Daggubati | Telugu Movie  News - Times of India

చివరిగా రుద్రమదేవి సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇటీవలే సమంతతో శాకుంతలం సినిమాని తెరకెక్కించి ఉన్న ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేసుకున్నారు. ఈ చిత్రంతో గుణశేఖర్ పని అయిపోయింది అంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా విషయంపై తనకు చాలా దెబ్బ పడిందని తెలియజేశారు. దీంతో 70 కోట్లు ఖర్చుపెట్టి తీస్తే కేవలం 10 కోట్లు కూడా రాలేదని సమంత కెరియర్ లో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

అయితే గుణశేఖర్ గతంలో ఒక భారీ ప్రాజెక్టును ప్రకటించారు దాని పేరు హిరణ్యకశ్యప రానా హీరో ఒక పారాణిక గాధ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా ఏళ్ల తరబడి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమా గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించడానికి పలు ప్రయత్నాలు చేశారు. శాకుంతలం సినిమా ఫ్లాప్ తో గుణశేఖర్ తో ఎవరు సినిమా తీయడానికి ముందుకు రాలేదు. అయితే నిన్నటి రోజున రానా హిరణ్యకశ్యప ప్రాజెక్టుని సడన్గా ప్రకటించి ఆశ్చర్యపరిచేలా చేశారు. ఇందుకు కథను త్రివిక్రమ్ అందిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ విషయంపై గుణశేఖర్ చాలా హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. రానా చేసిన పనికి రగిలిపోతూ పరోక్షంగా ఒక ట్విట్ చేశారు.. దేవుడిని మీ కథకు ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నప్పుడు దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తూ ఉంటాడు అని మీరు గుర్తుంచుకోవాలి నైతిక విలువలతో సమాధానం చెప్పే రోజు వస్తుందంటూ ట్విట్ చేశారు. ఈ విషయం రానా, త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ట్విట్ చేసినట్లుగా పలువురు నేటిజన్లు తెలుపుతున్నారు. ఈ విషయం విన్న అభిమానులు రానా త్రివిక్రమ్ ఇంత నీచానికి దిగజారి పోయారా అంటే కామెంట్స్ చేస్తున్నారు.