ఎన్టీఆర్ తరువాత కొరటాల లిస్ట్ లో ఉన్న హీరోస్ వీళ్ళే.. పెద్ద సౌండ్ పార్టీలనే పట్టాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నా.. పూటకో డైరెక్టర్ తెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు . కానీ ఇండస్ట్రీలోకి ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా పాన్ ఇండియా డైరెక్టర్లుగా మారిన అవార్డ్స్ సొంతం చేసుకున్న కొందరు డైరెక్టర్లు అంటే జనాలకి ఓ మార్క్ ఉంటుంది . ఈయన సినిమాలు ఎలా అయినా చూడొచ్చు ..ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు ..వల్గర్ పదాలు ఉండవు బూతు సీన్స్ ఉండవు అని.. ఓ నమ్మకం ఉంటుంది . అలాంటి డైరెక్టర్ కొరటాల శివ . కొరటాల శివ ఇప్పటివరకు తనకి నచ్చిన సినిమాలలో ఎక్కడ బ్యాడ్ వర్డ్ యూస్ చేయలేదు.

అంతేకాదు ఏ హీరోని అభిమానులు ఏ బాడీ లాంగ్వేజ్ లో చూడాలనుకుంటున్నారో వాళ్ళ నాడిపట్టి తెరకెక్కించేస్తాడు . కాగా ప్రభాస్ మిర్చి సినిమాతో ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కొరటాల శివ మనకు తెలిసిందే. కాగా ఆచార్యతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న కొరటాల శివ .. ఇప్పుడు ఎన్టీఆర్ తో దేవరా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఆయన కెరియర్ ఎటు తిరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఒకవేళ ఫ్లాప్ కొడితే మాత్రం కెరియర్ నాశనం అయిపోయింది అని చెప్పాలి. అయితే ఈలోపే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొరటాల శివ బడాబడా హీరోలను లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారట . మరీ ముఖ్యంగా భరత్ అనే నేను సినిమాతో హిట్ ఇచ్చిన మహేష్ బాబును లైన్లో పెట్టడానికి చూస్తున్నాడట కొరటాల . అయితే మహేష్ బాబు కన్నా ముందే అల్లు అర్జున్తో సినిమా చేయడానికి ఫిక్స్ అవ్వాలని చూస్తున్నాడు కొరటాల.. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమాని చేయడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత ప్రభాస్తో మరో సినిమా కూడా తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారట . అందరు బడా హీరోలను లైన్లో పెట్టుకొని ఉన్నా సరే కొరటాల శివ ఎన్టీఆర్ థర్టీ సినిమా హిట్ అయ్యాకే ఏ సినిమా స్క్రిప్ట్ అయిన వాళ్ళకి చెప్తాను అని భీష్ముంచుకుని కూర్చున్నాడట. చూద్దాం మరి దేవర సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో కొరటాల శివకు..?