కెరీర్ లో ఎన్టీఆర్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే.. ఇప్పటికి ఆ విషయంలో బాధపడుతున్నాడా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని టాప్ పొజిషన్లో రాజ్యమేలేస్తున్నాడు . మరీ ముఖ్యంగా హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకోరావడం ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా పూర్తి అయిపోగానే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్ .

ఈ ఇద్దరు డైరెక్షన్లో పూర్తవగానే మరోసారి తన ఫేవరెట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో మరో సినిమాకి కమిట్ అవ్వబోతున్నాడు ఎన్టీఆర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ గతంలో కెరియర్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది . మనకు తెలిసిందే చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ చాలా చబ్బీ జబ్బీగా ఉండేవాడు. అయితే అంత వెయిట్ లోనూ డాన్స్ స్టెప్స్ అవలీలగా వేసేసేవాడు. అయితే రాజమౌళి అన్న ఒక్క మాటకు పౌరుషంగా ఆయన వెయిట్ తగ్గించి చూపించాడు .

కానీ ఎన్టీఆర్కు తను వెయిట్ తగ్గాకే తనని తెరపై చూసుకోవడానికి ఇంట్రెస్ట్ కలిగిందట . అంతకుముందు చేసిన సినిమాలు హిట్ అయినా ఎక్కడో ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది కలగలేదట .రాఖీ – స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి..కానీ చూస్తుంటే ఓ విధంగా అనిపిస్తూ ఉంటుందట . అదే లావు తగ్గిన తర్వాత చేసిన సినిమాలు చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్కు భలే కొత్త ఫీలింగ్ కలుగుతుందట. అసలు లావు నేను ముందే ఎందుకు తగ్గలేదు.. అన్న ఫీలింగ్ ఎన్టీఆర్కు చాలాసార్లు కలిగిందట. కెరియర్లో ఆ తప్పు తప్పిస్తే ఎన్టీఆర్ మరి ఏ తప్పు చేయలేదు అని చాలాసార్లు ఫీల్ అయ్యాడట . దీంతో సోషల్ మీడియాలో తారక్ కి సంబంధించిన ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది..!!