భార్యకి రామ్ గోపాల్ వర్మ ఎందుకు విడాకులు ఇచ్చారు?

రాంగోపాల్..ఈయన గురించి వినని వారందరరేమో. ఆయన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ గా గుర్తింపు సాధించారు. సినిమాల్లోనే కాదు ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా రాంగోపాల్ హాట్ టాపిక్ అవుతుంటారు. ఆయన ఏది మాట్లాడిన ఒక సంచలనమే. ఇప్పుడు ఆయన వివాదాస్పద సినిమాలు తీసినప్పటికీ రాంగోపాల్ వర్మని ఇప్పటికి చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఈయన సినిమా తీయడమే కాదు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన చాలు అది వివాదమే. ఇప్పుడు రాజకీయ నాయకులపై కూడా సినిమాలు తీస్తున్నారు. అయితే రాంగోపాల్ వర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు విడాకులు కూడా ఇచ్చారు. అసలు ఆయన ఎందుకు విడాకులు ఇచ్చారు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది.

రాంగోపాల్ వర్మ చదువుకునే రోజుల్లోనే స్టోరీలు తన ఫ్రెండ్స్ కి చెబుతుండేవారు. ఇక కథలు విన్న ఆయన స్నేహితులైతే నా దగ్గర డబ్బులు ఉంటే కచ్చితంగా నిన్ను డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తాను అనేవారట. చదువు అయిపోయాక రాంగోపాల్ వర్మ తాజ్ హోటల్ లో పనిచేసేవారు. అప్పట్లో ఆయనకు 800 రూపాయల జీతం వచ్చేది. అప్పుడే రాంగోపాల్ వర్మ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా పుట్టింది. రాంగోపాల్ వర్మ భార్య పేరు రత్న. అయితే అప్పటికే సినిమాలంటే పిచ్చి ఉన్న రాంగోపాల్ వర్మ సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగేవాడు. కొంత మంది నిర్మాతలకు కూడా కథలు చెప్పారు. అప్పుడే శివ సినిమాకి దర్శకత్వం వహించి సంచలన దర్శకుడిగా మారాడు. ఆ తరువాత కూడా ఎన్నో హిట్ సినిమాలు అందించాడు.

అయితే సినిమాల మీద మరింత ఇంట్రెస్ట్ పుట్టి సినిమాల ద్యాసలోనే ఉండేవాడు. ఇంటికి కూడా వచ్చేవాడు కాదంట. ఇంటికి వచ్చిన ప్రతిసారి ఎందుకు తాగుతున్నావ్, ఎక్కడికి వెళ్తున్నావ్ అని భార్య నిలదీసేదంట. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండేవారు. దాంతో రత్నకి కోపం వచ్చి, విసిగిపోయి కూతుర్ని తీసుకొని భర్తకు విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందంట.