“నీహారికతో నువ్వు వేగలేవు”..పెళ్లికి ముందే చైతన్య కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న హీరో హీరోయిన్ల లిస్ట్ ఎక్కువగా వినిపిస్తుంది . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే బడా బడా స్టార్ ప్రముఖులు అందరు కూడా విడాకులు బాటపడుతూ ఫ్యాన్ కు కన్నీరు మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకొని ఆ విషయాన్ని అఫీషియల్ గా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి నిహారిక జొన్నలగడ్డ చైతన్యకు సంబంధించిన పలు రకాల వార్తలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

మరికొందరు నిహారికని బూతులు తిడుతున్నారు . ఈ క్రమంలోని “నిహారికను పెళ్లి చేసుకుంటే నువ్వు వేగలేవు ..ఆమె మహా కోపిష్టి “అంటూ ఓ హీరో ముందుగానే చైతన్యకు వార్నింగ్ ఇచ్చారట . దీంతో ఈ విషయం ఈన్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ వార్నింగ్ ఇచ్చిన హీరో ఎవరో కాదు స్వయాన నిహారిక అన్న వరుణ్ తేజ్ . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది . నిహారిక – వరుణ్ తేజ్ ఎంత క్లోజ్ గా ఉంటారో అంతే పోట్లాడుకుంటూ ఉంటారు . అఫ్ కోర్స్ అన్నా చెల్లెలు అంటే ఆ మాత్రం గొడవలు ఉంటాయి .

అయితే నిహారికతో నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత .. వరుణ్ చైతన్య చాలా బాగా మింగిల్ అయిపోయారట. బావ బామర్ధి లా కాకుండా ఫ్రెండ్స్ లా మాట్లాడుకున్నారట . ఈ క్రమంలోనే సరదాగా నిహారిక గురించి సీక్రెట్స్ ని బయటపెడుతూ ..”అది చాలా మొండిది.. చిన్నప్పటి నుంచి అన్ని ఆ అమ్మాయి చెప్పినట్లే జరగాలి అనుకుంటుంది ..అది పెద్ద కోపిష్టి .. నువ్వు చాలా సాఫ్ట్ .. తను చెప్పిన దానికి తానా తందానా అంటూ ఉంటే నిన్ను ఆడేసుకుంటుంది.. జాగ్రత్త స్ట్రాంగ్ గా మారు “అంటూ హెచ్చరించారట. వరుణ్ తేజ్ తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ అప్పుడు చైతన్యకు మంచి సందేశం ఇచ్చాడు .పాపం చైతన్యనే ఆ మాటలను సరదాగా తీసుకొని సీరియస్గా బుక్ అయిపోయాడు . ప్రజెంట్ ఈ జంట విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది..!!