“సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఓ దురదృష్టవంతుడు”..హిట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఓ దురదృష్టవంతుడు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ కామెంట్ చేయడం ఎప్పుడు చర్చినీయాంసంగా మారింది . అయితే ఆయన పాజిటివ్ వేలోనే చెప్పాలనుకున్న ఆ పదం ఎందుకో మెగా అభిమానులు తీసుకోలేకపోతున్నారు . రీసెంట్గా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా బేబీ .

ఈ సినిమాను డైరెక్ట్ చేసింది సాయి రాజేష్ . గతంలో ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేసినా రాని గుర్తింపు ఒకే ఒక సినిమాతో ఈయనకు తెచ్చి పెట్టింది బేబి. కాగా బేబీ సినిమా జూలై 14 రిలీజ్ అయి దాదాపు 75 కోట్లు వసూలు రాబట్టింది. ఈ క్రమంలోని సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో సక్సెస్ సినిమా ప్రమోషన్స్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు .

ఈ క్రమంలోనే ఈవెంట్ లో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ..” మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో దురదృష్టవంతుడని.. ఎందుకంటే ఆయనకు ఆయన ఫ్యాన్ గా ఉండే అవకాశం లేదని ..ఆ అవకాశం మాకు మాత్రమే దక్కిందని .. మా లైఫ్ ని మీరు ఎప్పటికీ చూడలేరు అని.. బాధలో ఉన్న ..జ్వరంలో ఉన్న సంతోషంలో ఉన్న మాకు నచ్చేది ఇష్టపడేది ఒకటే చిరంజీవి పాటే ..మా పారాసిట్మాల్ మీరే” అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించారు. అఫ్ కోర్స్ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఆయన మెగాస్టార్ చిరంజీవికి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అర్థమవుతుంది . కానీ ఎందుకు ఆయన చెప్పిన కంపారిజన్ పెద్దగా మెగా ఫాన్స్ కు నచ్చడం లేదు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!