అలియా ముందే స్టేజీ పైనే రణవీర్ సింగ్ నాటీ కామెంట్స్.. దీపిక పదుకునే ఎలా తట్టుకుంటుందో..?

సినిమా ఇండస్ట్రీలో నాటీ నాటీగా ఉండే హీరోలు కౌంట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే వాటికి కొదవేలేదు. సినిమాలో హిట్ కొట్టినా కొట్టకపోయినా హీరోలు మాత్రం స్టేజిలపై తెగ పెర్ఫార్మన్స్ లు ఇచేస్తూ ఉంటారు. ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంటాడు రన్వీర్ సింగ్. మొన్నటికి మొన్న అమ్మాయిలు మాత్రమేనా ..? న్యూడ్ ఫోటోగ్రఫీ చేసేది అబ్బాయిలు చేయలేరా ..?అంటూ న్యూడ్ ఫోటోగ్రఫీకి తెరలేపి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన రణ్వీర్ సింగ్ …ఫొటోస్ ఏ విధంగా వైరల్ అయ్యాయో మనకు తెలిసిందే.

 

కాగా ప్రెసెంట్ రన్వీర్ సింగ్ – అలియా భట్ తో కలిసి రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ సినిమాలో నటిస్తున్నాడు . పుల్ లవ్-రొమాంటిక్ -ఫ్యామిలీ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై28నరిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలియా భట్ – రన్వీర్ సింగ్ తెగ తిరిగేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా ఢిల్లీ వీధుల్లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించారు . అయితే అక్కడ అలియా భట్ కు జుంకాలు గిఫ్టుగా ఇచ్చాడు తన అభిమాని. పక్కనే ఉన్న రనవీర్ ఆటపట్టిస్తూ..” నువ్వు ఝంకాలు ఇచ్చిన కారణంగా అలియా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు..?” అని అతగాడు ..”అలియా నుండి కాదు మీరు ఒక హగ్ ఇస్తారా..?” అంటూ అడుగుతారు.

అయితే రణవీర్ ఎవరు ఊహించని విధంగా ” హగ్ ఆలియా ఇస్తుంది ..నువ్వు ఆ జుంకాలు నాకు ఇచ్చేయ్. నేను మీ వదినకి ఇస్తాను.. తను చాలా ఖుషి గా ఫీల్ అవుతుంది ” అంటూ చెప్పుకొస్తాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది . కాగా ఆలియా పక్కనుండగానే దీపికపై ఇలాంటి నాటికి కామెంట్స్ చేయడం అలియా భట్ కు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే రన్బీర్ సింగ్ ఫస్ట్ నుంచి ఇలాంటి క్యారెక్టర్ కావడంతో బాలీవుడ్ జనాలు దీనిని లైట్గా తీసుకుంటున్నారు . కానీ ఈ వీడియో మాత్రం సూపర్ ఫన్నీగా ఉంది అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు..!!